మహేష్ సినిమాలో మరో సీనియర్ హీరో ?

మహేష్ సినిమాలో మరో సీనియర్ హీరో ?

Published on Jul 24, 2022 10:36 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ నటించబోతున్నాడని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాత్రలో మరో మాజీ హీరో పేరు వినిపిస్తోంది. హీరో రాజశేఖర్ ఈ పాత్రలో నటిస్తున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది. ఆగస్టు నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ముందుగా మహేష్ పై సోలో సాంగ్ ను అలాగే ఒక ఫైట్ ను తీస్తారట. ఆ తర్వాత లాంగ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తారట. ఇక పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆ అంచనాలకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ కూడా మహేష్ కి సరిపోయే పక్కా స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు