ఇండస్ట్రీలో ఏ ఒక్కరికో పెద్దరికం ఇవ్వడం సరికాదు – సుమన్

Published on Jan 4, 2022 12:04 am IST

ఏపీలో సినిమా టికెట్ ధరల తగ్గింపు అంశంపై ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా తిరుపతిలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సీనియర్ హీరో సుమన్ అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని సినిమా టికెట్ల సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అంతేకాదు నేను సినిమాల్లోకి వచ్చి 44 ఏళ్లు కావస్తోందని, 10 భాషల్లో 600 సినిమాల్లో నటించానని, చిత్ర పరిశ్రమలో ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో ఎదిగానని అన్నారు.

సినిమా రంగంలో ఐక్యత లేదనడం వాస్తవం కాదని, పరిశ్రమలో కృష్ణ, కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి సీనియర్లు ఉన్నారని సమస్యల పరిష్కారానికి వారి సలహా తీసుకోవాలన్నారు. ఇండస్ట్రీలో ఏ ఒక్కరికో పెద్దరికం కట్టబెట్టడం సరికాదని, ఇక రాజకీయాల గురుంచి ఇప్పుడు నేను మాట్లాడనని సుమన్ అభిప్రాయపడ్డారు.

సంబంధిత సమాచారం :