బాలకృష్ణకు విలన్ గా మారిన సీనియర్ హీరో !


నందమూరి బాలకృష్ణ తన 102 వ సినిమాను సీనియర్ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం ఆగష్టు 2వ వారం నుండి కుంభకోణంలో మొదలుకానుంది. సుమారు 40 రోజుల పాటు జరగబోయే ఈ షెడ్యూల్లో బాలకృష్ణ పాల్గొననున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న వార్తల ప్రకారం సీనియర్ తెలుగు హీరో ఒకరు ఇందులో ప్రతినాయకుడిగా నటిస్తున్నాడట.

అయన మరెవరో కాదు శ్రీకాంత్. ఈ సినిమాలో శ్రీకాంత్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, నటనకు ఎక్కువ ఆస్కారముంటుందని అంటున్నారు. అయితే సినిమా యూనిట్ నుండి మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాతో సీనియర్ హీరో జగపతిబాబు విలన్ గా మారి కెరీర్లో మంచి సక్సెస్ ను చూసిన సంగతి తెలిసిందే. ఇకపోతే నయనతార హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రాన్ని సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.