మరో క్రేజీ ఆఫర్ కొట్టేసిన వేణు తొట్టెంపూడి !

Published on Aug 8, 2022 8:01 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న క్రేజీ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని, ఆ పాత్రలో మాజీ హీరో వేణు నటించబోతున్నాడని తెలుస్తోంది. వేణు హీరోగా నటించిన స్వయంవరం సినిమాతోనే త్రివిక్రమ్ తన సినీ ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ తో వేణు కలిసి పని చేయబోతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తోంది.

కాగా పదకొండు సంవత్సరాల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కలయికలో సినిమా వస్తుండే సరికి, ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే త్రివిక్రమ్ కూడా మహేష్ కి సరిపోయే పక్కా స్క్రిప్ట్ ను రెడీ చేశాడు. పైగా ఎన్టీఆర్ తో ‘అరవింద సమేత, అల్లు అర్జున్ తో ‘అల వైకుంఠపురములో’ వంటి వరుస హిట్ చిత్రాల తర్వాత త్రివిక్రమ్ ఈ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించబోతుంది.

సంబంధిత సమాచారం :