మెగాస్టార్ వాల్తేరు వీరయ్యలో మరో సీనియర్ హీరోయిన్ ?

Published on Aug 1, 2022 7:05 am IST

.

మెగాస్టార్ చిరంజీవితో హీరోగా వాల్తేరు వీరయ్య అనే పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు రవితేజ కూడా ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ఇద్దరు బ్రదర్స్ గా నటించబోతున్నారు. అయితే రవితేజ, ఈ చిత్రంలో మెగాస్టార్ కి సవతి తల్లి కొడుకు అట. ఈ సినిమాలో నటించబోతుంది. రవితేజ పాత్రకు తల్లి పాత్రలో సీనియర్ నటి జయసుధ కనిపించబోతుంది. జయసుధ పాత్ర కోసం రవితేజ పాత్ర స్ట్రగుల్ అవుతుందని.. ఈ క్రమంలో వాల్తేరు వీరయ్యతో రవితేజ పాత్రకు మధ్య అనుబంధం ఏర్పడుతుందని తెలుస్తోంది.

కాగా ఇంటర్వెల్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లో రవితేజ పాత్ర ఈ సినిమాలో రివీల్ అవుతుందట. రవితేజ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌ లో రవితేజ, చిరంజీవిలపై కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన హీరోయిన్ గా శృతి హాసన్ నటించబోతుంది.

సంబంధిత సమాచారం :