సెన్సేషన్ : ఐదేళ్ల గ్యాప్ లో అప్పుడు చరణ్ – ఇప్పుడు నాని

సెన్సేషన్ : ఐదేళ్ల గ్యాప్ లో అప్పుడు చరణ్ – ఇప్పుడు నాని

Published on Mar 31, 2023 10:30 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీ రంగస్థలం. సమంత రూత్ ప్రభు హీరోయిన్ గా నటించిన ఈ మూవీ 2018 మార్చి 30న రిలీజ్ అయింది. ఇక ఈ మూవీలో చిట్టి బాబుగా రామ్ చరణ్ సూపర్ పెర్ఫార్మన్స్ కి విమర్శకుల నుండి సైతం ప్రసంశలు కురవడం విశేషం. మాస్ యాక్షన్ అంశాలతో యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రంగస్థలం తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక లేటెస్ట్ గా నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన దసరా మూవీ కూడా మాస్ యాక్షన్ రస్టిక్ అంశాలతో తెరకెక్కింది.

కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మించింది. ఇక నేడు శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన ఈ మూవీలో కూడా ధరణి పాత్రలో సూపర్ మాస్ యాక్టింగ్ తో అదరగొట్టారు. ఆకట్టుకునే కథ, కథనాలతో దర్శకుడు శ్రీకాంత్ తెరకెక్కించిన దసరా ప్రస్తుతం సూపర్ హిట్ టాక్ తో కొనసాగుతోంది. అయితే విషయం ఏమిటంటే, 2018 మార్చి 30న చిట్టిబాబుగా చరణ్, అలానే 2023 మార్చి 30న ధరణి గా నాని ఇద్దరూ కూడా తమ తమ పాత్రల్లో సహజ నటనతో అందరినీ ఆకట్టుకుని కెరీర్ పరంగా సెన్సేషన్ సృష్టించారు అనే చెప్పాలి. మొత్తంగా ఈ ఐదేళ్ల గ్యాప్ లో ఈ ఇద్దరూ సృష్టించిన ఈ సెన్సేషన్ ప్రస్తుతం ఆడియన్స్ లో ఇంట్రెస్టింగ్ చర్చగా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు