బుల్లితెర పై బన్నీ సినిమాకి సెన్సేషన్ రెస్పాన్స్!

Published on Sep 14, 2023 10:00 pm IST

అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం బుల్లితెర పై కూడా అదే జోరును ఇప్పటికీ కనబరుస్తోంది. చివరి వారం ఈ చిత్రం జెమిని టీవీ లో ప్రసారం అయ్యింది. ఈ చిత్రం 5.37 టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేయడం జరిగింది. ఇది సెన్సేషన్ అని చెప్పాలి.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో నివేతా పేతురాజ్, సుశాంత్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం బుల్లితెర పై కూడా ఇలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :