ప్రీ సేల్స్ తో హాఫ్ మిలియన్ మార్క్ ను టచ్ చేయనున్న భీమ్లా నాయక్!

Published on Feb 23, 2022 11:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ ను పోషిస్తూ, రానా దగ్గుపాటి మరొక ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. అంతేకాక ఈ చిత్రం లో ఒక హిట్ సాంగ్ కి లిరిక్స్ అందించారు.

ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియోలు, పాటలకు ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ను ఫిబ్రవరి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రానికి సర్వత్రా అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో అవుతోంది. USA లో ఇప్పటి వరకూ 400కే డాలర్లు ప్రీ సేల్స్ తో రాబట్టగా, ఇప్పుడు హాఫ్ మిలియన్ మార్క్ వైపు కి దూసుకు పోతుంది. రిలీజ్ టైమ్ కి ఇది ఎక్కడి వరకూ పోతుంది అనేది చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సైతం భీమ్లా తన అడ్వాన్స్ బుకింగ్స్ తో తన సత్తా చూపుతున్నాడు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :