“హరిహర వీరమల్లు” పై సెన్సేషనల్ బజ్.!

Published on Feb 1, 2023 2:02 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ చిత్రం “హరిహర వీరమల్లు” కోసం తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ దాదాపు 65 శాతం కంప్లీట్ కాగా అభిమానులు అయితే ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా పై లేటెస్ట్ గా ఓ సెన్సేషనల్ బజ్ అయితే సినీ వర్గాల్లో వైరల్ గా మారింది.

దీని ప్రకారం అయితే ఈ చిత్రం కూడా ఓ ఫ్రాంచైజ్ లానే రాబోతుందట. దీనితో హరిహర వీరమల్లు రెండు సినిమాలుగా రానున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికే సినిమా కంప్లీట్ కావడానికి చాలా సమయం తీసుకునేలా ఉంది ఇక రెండు భాగాలుగా అంటే అదెప్పుడు వస్తుందో అనేది కాలమే నిర్ణయించాలి. ఇక మెగాసూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :