రెండవ సినిమాని మొదలుపెట్టిన సెన్సేషనల్ డైరెక్టర్ !

ఈ ఏడాది తెలుగు పరిశ్రమ అందుకున్న విజయాల్లో రానా నటించితిన్ ‘ఘాజి’ చిత్రం కూడా ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. దీంతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డికి ప్రేక్షకులు, విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుని ఒక సెన్సేషన్ గా మారాడు. ‘ఘాజి’ సినిమాను చూసిన ప్రేక్షకులు ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ మీద కనబడని సబ్ మెరైన్ డ్రామాను చూపించిన సంకల్ప్ రెడ్డి నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందో చూడాలని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కానీ సంకల్ప్ మాత్రం ‘ఘాజి’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకునే రెండవ ప్రాజెక్టును మొదలుపెట్టాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని శ్రీ చాముండి ఫిలిమ్స్ పతాకంపై గవర పార్థసారథి నిర్మిస్తున్నారు. ఇందులో ఒక యంగ్ హీరో నటిస్తాడని కూడా తెలుస్తోంది. అయితే ఈ చిత్రం ఎలా ఉంటుంది, ఎప్పుడు రెగ్యులర్ షూట్ మొదలవుతుంది అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.