రాజమౌళి చేతుల మీదుగా హీరో ‘ట్రైలర్’ !

Published on Jan 10, 2022 11:30 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా పరిచయమవుతూ దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కిస్తున్న చిత్రం “హీరో”. కాగా ఈ సినిమా ట్రైలర్ ను ఈ రోజు సాయంత్రం 04:05 గంటల ఐదు నిమిషాలకు విడుదల కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ లాంచ్ కానుంది. ఇక అమ‌ర్‌రాజా మీడియా అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ప‌ద్మావ‌తి గ‌ల్లా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అశోక్‌ గల్లా సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే “ఆర్ఆర్ఆర్” సినిమా రిలీజ్ వాయిదా పడడంతో “హీరో” సినిమాను సంక్రాంతి రేసులోకి తీసుకొచ్చారు మేకర్స్. జనవరి 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతి రేసులో ఉన్న బంగార్రాజు వంటి పెద్ద సినిమాతో పాటు “డీజే టిల్లు” వంటి సినిమా కూడా పోటీలో ఉంది.

సంబంధిత సమాచారం :