షారుఖ్ “జవాన్” అనౌన్స్మెంట్ కి మాసివ్ రెస్పాన్స్.!

Published on Jun 4, 2022 5:45 pm IST


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సాలిడ్ ప్రాజెక్ట్ లలో కోలీవుడ్ స్టార్ యంగ్ దర్శకుడు అట్లీ తో ప్లాన్ చేసిన భారీ యాక్షన్ డ్రామా “జవాన్” కూడా ఒకటి. మునెపెన్నడూ చూడని కొత్త షారుఖ్ ని అట్లీ పరిచయం చేస్తూ టైటిల్ అనౌన్స్ చేసాడు. అయితే దీనిపై ఒక మస్సివ్ గ్లింప్స్ ని రిలీజ్ చెయ్యగా దీనికి ఇప్పుడు సెన్సేషనల్ మాసివ్ రెస్పాన్స్ వచ్చింది.

జస్ట్ ఈ అనౌన్సమెంట్ వీడియోకె యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ నుంచి రికార్డు స్థాయిలో 23 మిలియన్ కి పైగా వ్యూస్ నమోదు అయ్యాయి. అంతే కాకుండా యూట్యూబ్ నుంచి అయితే హాఫ్ మిలియన్ కి పైగా లైక్స్ వచ్చాయి. దీనితో ఈ మాస్ గ్లింప్స్ పేరిట భారీ రికార్డు నమోదు అయ్యింది. మొత్తానికి అయితే ఈ సినిమాపై హైప్ ని జస్ట్ ఈ వీడియో రేంజ్ లో చూపించింది అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :