అఫీషియల్ : “రజిని 170” కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.!

Published on Oct 1, 2023 2:00 pm IST

కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “జైలర్” తో భారీ హిట్ కొట్టి మళ్ళీ తన ట్రాక్ లోకి వచ్చేయగా ఇక నెక్స్ట్ రజిని నటిస్తున్న సినిమాలపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ లైనప్ లో టాలెంటెడ్ దర్శకుడు టి జి జ్ఞ్యానవేల్ తో రజిని కెరీర్ లో చేయనున్న 170వ సినిమా కూడా ఒకటి. మరి ఈ చిత్రంపై కూడా గట్టి అంచనాలు ఉండగా ఈ చిత్రం పై భారీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని అందిస్తున్నారు.

ఈ చిత్రాన్ని తాము ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించనున్నాడు అని లాక్ చేసి మాసివ్ అనౌన్సమెంట్ ని అయితే అందించారు. దీనితో జైలర్ తర్వాత మళ్ళీ రజిని సినిమాకి అనిరుద్ వర్క్ చేయనున్నాడు అని చెప్పాలి. మరి ఈ అవైటెడ్ సినిమా షూటింగ్ అయితే త్వరలోనే మొదలు కానుంది.

సంబంధిత సమాచారం :