థలపతి “బీస్ట్” చెంతకు కళ్ళు చెదిరే భారీ ఆఫర్.?

Published on Aug 4, 2021 3:00 pm IST


ఇళయ థలపతి విజయ్ జోసెఫ్ ఇప్పుడు తన మార్కెట్ ని మరింత పెంచుకుంటూ వస్తున్నాడు. మరి ఇప్పుడు తాను చేస్తున్న లేటెస్ట్ చిత్రం “బీస్ట్” పై కూడా భారీ అంచనాలే నెలకొన్నాయి. కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు శరవేగంగా రెండో షెడ్యూల్ ని జరుపుకుంటుంది.

ఇక ఇదిలా ఉండగా విజయ్ సినిమాలు అంటే భారీ స్థాయి బిజినెస్ అని అందరికీ తెలిసిందే.. అందులో భాగంగానే బీస్ట్ కి భారీ ఆఫర్ ఒకటి వచ్చిందని హిందీ డబ్బింగ్ రైట్స్ కి గాను ఈ చిత్రానికి 45 కోట్లకు పైగానే ఆఫర్ వచ్చిందని నయా టాక్ వైరల్ అవుతుంది. ఒక్క హిందీ హక్కులకు ఇంత మొత్తం అనే భారీ ఆఫరే అని చెప్పాలి.

ప్రస్తుతానికి అయితే చిత్ర నిర్మాణ సంస్థ తో ప్రస్తుతం నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఈ చిత్రంలో విజయ్ సరసన స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :