బుక్ మై షో లో సెన్సేషన్ రేటింగ్ తో “హను మాన్”

బుక్ మై షో లో సెన్సేషన్ రేటింగ్ తో “హను మాన్”

Published on Jan 13, 2024 1:30 AM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం పెయిడ్ ప్రీమియర్ షో లకి సూపర్ రెస్పాన్స్ రావడం తో ఆడియెన్స్ ఈ సినిమా కి మొదటి రోజు నుండే థియేటర్ల కి క్యూ కట్టారు. అయితే ఈ సినిమా బుక్ మై షో లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం 9.7 రేటింగ్ తో దూసుకు పోతుంది. ఇది సెన్సేషన్ అని చెప్పాలి.

తేజ సజ్జ యాక్టింగ్ తో పాటుగా, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఈ చిత్రం లో అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం లాంగ్ రన్ లో భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు