ఓటీటీలో “కార్తికేయ 2” కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Oct 7, 2022 4:00 pm IST

రీసెంట్ గా టాలీవుడ్ దగ్గర వచ్చి భారీ హిట్ అయ్యినటువంటి చిత్రాల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన చిత్రం “కార్తికేయ 2” కూడా ఒకటి. తెలుగు సహా హిందీ అలాగే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర కూడా వసూళ్ల పరంగా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి లో రిలీజ్ అయ్యింది.

ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న జీ 5 లో ఈ అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కి రాగా ఇప్పుడు దీనికి ఈ 48 గంటల్లో సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 100 కోట్ల ప్లస్ స్ట్రీమింగ్ నిమిషాలు రెస్పాన్స్ ఈ చిత్రానికి రెండు రోజుల్లో దక్కింది అట. ఇది మామూలు విషయం కాదని చెప్పాలి. మరి థియేటర్స్ వంతు అయ్యాక ఇపుడు ఓటిటి లో ఈ చిత్రం సత్తా చాటుతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సాలిడ్ మ్యూజిక్ ఇవ్వగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :