పవన్ పవర్ ఎపిసోడ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

పవన్ పవర్ ఎపిసోడ్ కి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Feb 3, 2023 3:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ లు మొదటిసారిగా స్క్రీన్ షేర్ చేసుకొని వచ్చిన మోస్ట్ అవైటెడ్ ఆహా పవర్ ఎపిసోడ్ ఎట్టకేలకి నిన్న రాత్రి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఈ అవైటెడ్ ఎపిసోడ్ రికార్డు బ్రేకింగ్ వ్యూస్ తో సెన్సేషనల్ రెస్పాన్స్ ని అందుకోవడం ఆసక్తిగా మారింది.

ఇలా మొదలైన ఈ ఎపిసోడ్ హవా అయితే ఇప్పుడు మరో సెన్సేషనల్ రెస్పాన్స్ ని కొల్లగొట్టినట్టుగా ఆహా వారు తెలుపుతున్నారు. ఈ బాప్ ఆఫ్ ఆల్ ఎపిసోడ్స్ గా వచ్చిన ఎపిసోడ్ పేరుకి తగ్గట్టుగానే ఆహా లో ఫాస్టెస్ట్ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్రాస్ చేసిన ఎపిసోడ్ గా నిలిచి ఆల్ టైం రికార్డు సెట్ చేసిందట. దీనితో పవన్ తన పని తాను చేసుకెళ్ళిపోతున్నారని చెప్పాలి. ఇక ఏ సాలిడ్ ఎపిసోడ్ ఎలాంటి రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు