“పోకిరి” స్పెషల్ షోస్ కి రిలీజ్ ని మించి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Aug 10, 2022 7:08 am IST


మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే ని ఈ ఏడాది మాత్రం మహేష్ ఫ్యాన్స్ నెవర్ బిఫోర్ లెవెల్లో జరిపారని చెప్పాలి. ఒక్క మహేష్ విషయంలో అనే కాకుండా టాలీవుడ్ లో ఇది వరకు ఏ హీరోకి చేయని అదిరే ప్లానింగ్స్ తో తమ అభిమాన హీరో బర్త్ డే లను తాము జరుపుకున్నారు.

మరి ఇందులో భాగంగా మహేష్ ఆల్ టైం బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ “పోకిరి” స్పెషల్ షోస్ ప్లాన్ చేయగా వీటికి సెన్సేషనల్ రెస్పాన్స్ థియేటర్లలో రావడం విశేషం. రికార్డ్ నెంబర్ షోస్ తెలుగు రాష్ట్రాలు సహా ఓవర్సీస్ లో ప్లాన్ చేయగా మరి ఈ షోస్ కి నిన్న థియేటర్స్ లో రెస్పాన్స్ అప్పుడు రిలీజ్ మీద దద్దరిల్లింది.

నాన్ స్టాప్ సెలెబ్రేషన్స్ విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ సినిమాకి ఎలా లేదన్న 60 లక్షలకు పైగా వసూళ్లు రావచ్చని ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఇలా మొత్తానికి అయితే పోకిరి మళ్లీ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ ని నమోదు చేసింది.

సంబంధిత సమాచారం :