“RRR” జపాన్ రిలీజ్ కి సెన్సషనల్ రెస్పాన్స్.!

“RRR” జపాన్ రిలీజ్ కి సెన్సషనల్ రెస్పాన్స్.!

Published on Oct 23, 2022 7:03 AM IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” చిత్రం కోసం అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏ భారతీయ సినిమా తెచ్చుకోని స్థాయి భారీ ఆదరణను ఈ చిత్రం అందుకొని మరో గర్వించదగ్గ సినిమాగా నిలిచింది. ఇక ఈ సినిమా అవైటెడ్ జపాన్ రిలీజ్ అయితే నిన్న ఎంతో అట్టహాసంగా భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యింది.

అయితే దీనికి గాను అక్కడి ఆడియెన్స్ ఇండియన్ సినిమా నుంచి రిలీజ్ అయ్యిన అన్ని సినిమాల కన్నా భారీ రెస్పాన్స్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రాజమౌళి గత భారీ హిట్ చిత్రం బాహుబలి 2 కన్నా దీనికి ఎక్కువ స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు అయ్యినట్టుగా సినీ వర్గాలు చెబుతుండగా దీనిపై మరింత డీటెయిల్స్ రానున్నట్టుగా తెలుస్తుంది. అలాగే అక్కడ అయితే హైయెస్ట్ గ్రాసర్ గా సూపర్ స్టార్ రజినీ ముత్తు ఉంది మరి దానిని RRR బ్రేక్ చేసే ఛాన్స్ ఎక్కువే ఉన్నట్టుగా కూడా అంటున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు