అన్‌స్టాపబుల్ 2: సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న లేటెస్ట్ ఎపిసోడ్

అన్‌స్టాపబుల్ 2: సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న లేటెస్ట్ ఎపిసోడ్

Published on Dec 6, 2022 3:01 PM IST

ప్రముఖ తెలుగు ఓటిటి ప్లాట్‌ఫారమ్ ఆహా వీడియో యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన టాక్ షో అన్‌స్టాపబుల్ విత్ NBK సీజన్ 2 చాలా మంది హృదయాలను గెలుచుకుంటుంది. అనుకోని అతిథులు, బాలకృష్ణ చమత్కారమైన పంచ్ లు షోను సక్సెస్ చేశాయి. సెలబ్రిటీ టాక్ షో యొక్క 5వ ఎపిసోడ్ గత వారం విడుదలైంది.

అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు మరియు కోదండ రామిరెడ్డి లేటెస్ట్ ఎపిసోడ్‌ను అలరించారు. వారి జీవితంలోని అనేక జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఎపిసోడ్ కేవలం 2 రోజుల్లో 30 మిలియన్ నిమిషాలకు పైగా ప్రసారం చేయబడింది. ఈ షో ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అనే దానికి ఇదే సరైన ఉదాహరణ. ఈ షో రాబోయే ఎపిసోడ్‌లలో మరింత మంది సెలబ్రిటీలకు స్వాగతం పలుకుతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు