నైజాంలో 2వరోజు “దసరా” సెన్సేషనల్ స్టార్ట్.!

Published on Apr 1, 2023 11:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో వినిపిస్తున్న హీరో పేరు నాచురల్ స్టార్ నాని కాగా సినిమా అయితే తన “దసరా” నిలిచింది. కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ పీరియాడిక్ చిత్రం భారీ అంచనాలు మధ్య వచ్చి అయితే సెన్సేషనల్ హిట్ అయ్యింది. మరి మొదటి రోజే టైర్ 1 హీరోస్ రేంజ్ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ సాలిడ్ చిత్రం.

ఇక రెండో రోజు కూడా నైజాం లో సెన్సేషనల్ స్టార్ట్ తో మొదలైనట్టుగా తెలుస్తుంది. పి ఆర్ నంబర్స్ ప్రకారం దసరా రెండో రోజు నైజాం లో 3.48 కోట్లు షేర్ ని రాబట్టింది. దీనితో రెండు రోజుల్లోనే ఈ చిత్రం 10 కోట్ల షేర్ మార్క్ ని దాటేసి టైర్ 2 హీరోస్ లో బిగ్గెస్ట్ రికార్డ్స్ సెట్ చేస్తుంది. ఇక వారాంతంలో అయితే వసూళ్లు మరింత స్ట్రాంగ్ గా ఉండనున్నాయని చెప్పడంలో సందేహం లేదు. ఇక దసరా సెన్సేషన్ అయితే ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం :