సెన్సేషల్ “విరూపాక్ష”..100 కోట్ల క్లబ్ లోకి.!

Published on May 18, 2023 11:00 am IST

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ కాంబినేషన్ లో దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “విరూపాక్ష” కోసం తెలిసిందే. ఈ ఏడాది టాలీవుడ్ నుంచి వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా ఈ చిత్రం నిలవడమే కాకుండా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా అయితే ఈ చిత్రం నిలిచింది.

ఇక ఈ చిత్రం అయితే సెన్సేషనల్ మార్క్ 100 కోట్ల గ్రాస్ క్లబ్ లో అయితే చేరినట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. దీనితో సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లో మొదటి 100 కోట్ల సినిమా అయ్యితే అందుకున్నాడు. అలాగే దర్శకుని కెరీర్ లో కూడా ఈ చిత్రం మొదటి 100 కోట్ల గ్రాసర్ గా అయితే నిలిచింది. ఇక ఈ చిత్రానికి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించగా బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :