‘జగదేవక వీరుడు అతిలోక సుందరి’ కి సీక్వెల్ వస్తోందా ?

jagadeka-verudu-akiloka-son
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే గాక తెలుగు పరిశ్రమలో సైతం ఆల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’. చిరంజీవి, శ్రీదేవిలు జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించారు. ఈ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ వస్తుందని అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్న నైపథ్యంలో తాజాగా మరో వార్తా బయటికొచ్చింది. అప్పట్లో ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన అశ్విని దత్ ఫిలిం చాంబర్లో తమ స్వప్న బ్యానర్ పేరు మీద ‘జగదేక వీరుడు’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు.

దీంతో ఇక ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ కి సీక్వెల్ పక్కా అని, ఇందులో హీరోగా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ నటిస్తాడని, ఇప్పటికే స్క్రిప్ట్ కు సంబందించిన పనులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. అశ్వినీ దత్ ఈ టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేయించడం, పలు సందర్భాల్లో సీక్వెల్ తీస్తానని చెప్పడం వంటి వాటిని బట్టి ఈ వార్త నిజమయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే గనుక నిజమైతే మెగా అభిమానులకు నిజంగా పండగనే చెప్పుకోవచ్చు. కానీ ఈ విషయంపై ఇప్పటివరకూ ఎవరి నుండీ అధికారిక సమాచారం రాలేదు.