ఆ సూపర్ హిట్‌కు సీక్వెల్ ఆగిపోలేదట!

23rd, October 2016 - 05:02:22 PM

nikhil
నిఖిల్, స్వాతి హీరో హీరోయిన్లుగా నటించగా దర్శకుడిగా పరిచయమవుతూ చందూ మొండేటి రూపొందించిన ‘కార్తికేయ’ సినిమా ఏ స్థాయి విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 2014లో విడుదలైన ఈ సినిమా తర్వాత నిఖిల్, తెలుగు సినిమాకు ఓ కొత్త స్టార్ హీరోగా అవతరించారు. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు కురిపించిన చిన్న సినిమాగా పేరు తెచ్చుకున్న ‘కార్తికేయ’కు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో ప్రకటించిన ఈ హీరో, దర్శకులిద్దరూ ఇప్పటికీ ఆ విషయమై ఏదీ స్పష్టం చేయలేదు.

ఇక తాజాగా ‘కార్తికేయ’కు సీక్వెల్ తప్పకుండా ఉంటుందని, దర్శకుడు చందూ మొండేటితో కార్తికేయ 2కి సంబంధించిన చర్చలు జరుగుతూనే ఉన్నాయని నిఖిల్ అన్నారు. ప్రస్తుతానికి ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉండడం వల్ల కార్తికేయ 2 కుదరడం లేదని నిఖిల్ స్పష్టం చేశారు. ఈమధ్యే ప్రేమమ్‌తో సూపర్ హిట్ కొట్టిన చందు, ప్రస్తుతం తన కొత్త సినిమాకు ప్లాన్ చేసుకుంటూ ఉండగా, నిఖిల్ రెండు సినిమాలను లైన్లో పెట్టి దూసుకుపోతున్నారు. మరి ఈ ఇద్దరూ కార్తికేయ సీక్వెల్‌ను ఎప్పుడు మొదలుపెడతారో చూడాలి.