బాలక్రిష్ణ ‘నరసింహనాయుడు’ కి సీక్వెల్ ?

10th, December 2017 - 06:15:27 PM

నందమూరి బాలక్రిష్ణ కెరీర్లోని భారీ బ్లాక్ బస్టర్లలో ‘నరసింహనాయుడు’ కూడా ఒకటి. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ సినిమా 2001లో విడుదలై బాలయ్యను మాస్ ప్రేక్షకులకు మరింత చేరువయ్యేలా చేసింది. బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ ను తయారుచేసే పని జరుగుతోంది ఫిల్మ్ నగర్ బోగట్టా.

ఈ సీక్వెల్ ను ప్రముఖ కథా రచయిత, రజనీకాంత్ ‘నరసింహ’, చిరంజీవి ‘ఇంద్ర’ వంటి సినిమాలకు పనిచేసిన చిన్ని కృష్ణ రాస్తున్నారట. అయితే ఈ సంగతులన్నిటిపై ఎక్కడా ఎవరి నుండీ అఫీషియల్ కన్ఫర్మేషన్ అందలేదు. ఇకపోతే ప్రస్తుతం బాలక్రిష్ణ ‘జై సింహ’ సూటి పూర్తిచేసి ఎన్టీఆర్ బయోపిక్, సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణరెడ్డిల ప్రాజెక్ట్స్ పై పనిచేస్తున్నారు.