నయనతార సినిమాకి సీక్వెల్ ను సిద్ధం చేస్తున్నారు !
Published on Nov 13, 2017 6:25 pm IST

లేడీ సూపర్ స్టార్ నయనట్రా నటించితిన్ తాజా చిత్రం ‘అరమ్’ తమిళనాట ఘానా విజయాన్ని అందుకుంది. నవంబర్ 10న విడుదలైన ఈ సినిమాకు మొదటి రోజు నుండే బ్రహ్మాండమైన స్పందన లభించింది. ఈ చిత్రంలో నయనతార కలెక్టర్ పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని, విమర్శకులను ఆకట్టుకుంది.

ఈ చిత్రాన్ని గోపి నైనర్ డైరెక్ట్ చేశారు. చిత్ర విజయం సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకు ఈక్వెల్ ను రూపొందించాలనుకుంటున్నామని, ఇప్పటికే ఆ పనులు మొదలయ్యాయని ఆన్నారు. దీంతో ఈ సీక్వెల్ పై ఇప్పటి నుండే అంచనాలు మొదలయ్యాయి. ఇకపోతే ఈ ‘అరమ్’ చిత్రాన్ని తేలులో ‘కర్తవ్యం’ పేరుతో రిలీజ్ చేయనున్నారు. ఒకవేళ ఇది గనుక విజయం సాధిస్తే రాబోయే సీక్వెల్ ను కూడా తెలుగులో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.

 
Like us on Facebook