యూఎస్ లో రికార్డు ఫిగర్ అందుకున్న “మేజర్” వసూళ్లు.!

Published on Jun 9, 2022 10:00 am IST

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సినిమా “మేజర్” కోసం అందరికీ తెలిసిందే. సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా దర్శకుడు శశికిరణ్ తిక్క తెరకెక్కించిన ఈ సినిమా రియల్ లైఫ్ హీరో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది.

అయితే మొదటి రోజు మొదటి ఆట నుంచే మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ చిత్రం అన్ని చోట్ల కూడా మంచి వసూళ్లను నమోదు చేస్తూ అడివి శేష్ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం యూఎస్ మార్కెట్ లో రికార్డు ఫిగర్ ని టచ్ చేసింది. శేష్ కెరీర్ లోనే ఫస్ట్ 1 మిలియన్ డాలర్స్ వసూళ్లు చేసిన సినిమాగా మేజర్ ఇపుడు నిలిచింది.

మొత్తానికి అయితే అంచనాలు అన్ని అందుకొని ఈ సినిమా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకల సంగీతం అందించగా మహేష్ మరియు సోనీ పిక్చర్స్ ఇండియా, ఏ ప్లస్ ఎస్ స్టూడియోస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :