పవన్ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో అంతర్జాతీయ బ్రాండ్స్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ చిత్రం యొక్క ఆడియో వేడుక ఈరోజు సాయంత్రం జరగనుంది. తెలుగు ప్రేక్షకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం కావడంతో భారీస్థాయి క్రేజ్ నెలకొంది. అందుకే వాణిజ్య సంస్థలు ఈ సినిమాకు సంబందించిన ప్రతి అంశాన్ని తమకు సానుకూలంగా మలుచుకుని పవన్ క్రేజ్ ను క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాయి.

ఈరోజు సాయంత్రం జరుగుతున్న ఆడియో కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి మరింతగా జనాల్లోకి వెళ్లేందుకు అంతర్జాతీయ బ్రాండ్స్ పోటీపడ్డాయి. మొత్తం మీద 7 సంస్థలు స్పాన్సర్ షిప్ ను సాధించాయి. ఒక దక్షిణాది చిత్రానికి ఇలా ఒకేసారి 7 ఇంటర్నేషనల్ బ్రాండ్స్ స్పాన్సర్ చేయడం ఇదే మొదటిసారి. దీన్నిబట్టి పవన్ క్రేజ్ ఏ స్థాయిలో పనిచేస్తోందో అర్థమవుతోంది.

ఇకపోతే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయనున్నారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోలో మొత్తం 5 పాటలు ఉండనున్నాయి.