పోస్ట్ ప్రొడక్షన్ లో సమంత ‘శాకుంతలం’ !

Published on Jan 3, 2022 10:04 am IST

భారీ సెట్టింగ్ ల డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత అక్కినేని టైటిల్ రోల్ లో చేస్తోన్న సినిమా ‘శాకుంతలం’. కాగా టాకీ పార్ట్ ను ముగించిన చిత్ర బ‌ృందం.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుతోంది. సినిమాలో సీజీ వర్క్ కి సంబంధించిన ప్రస్తుతం చేస్తున్నారు. మలయాళ నటుడు దేవ్ కమల్ దుష్యంతుడిగానూ, మోహన్‌బాబు దూర్వాసుడిగానూ నటిస్తున్నారు.

అల్లు అర్జున్ తనయ అర్హ భరతుడిగా కనిపించబోతోంది. గుణటీమ్ వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సమంత గెటప్ అద్భుతంగా ఉండబోతోందని తెలుస్తోంది. సమంత నటిస్తున్న మొట్టమొదటి పౌరాణిక చిత్రం కావడంతో ‘శాకుంతలం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :