“దసరా” ప్రింట్స్ తో రేపటి నుండి శాకుంతలం రిలీజ్ ట్రైలర్!

Published on Mar 29, 2023 7:33 pm IST

సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం శాకుంతలం. ఏప్రిల్ 14, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలకి, పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటం తో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయడం జరిగింది. అందులో భాగంగా శాకుంతలం రిలీజ్ ట్రైలర్ ను మరో లెవెల్ లో ప్రమోట్ చేయనున్నారు.

రేపు నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన దసరా చిత్రం వరల్డ్ వైడ్ గా భారీగా థియేటర్ల లో విడుదల కాబోతుంది. ఈ ప్రింట్స్ కి జతగా ఈ శాకుంతలం రిలీజ్ ట్రైలర్ ఉండనుంది. హెవీ రీచ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. శాకుంతలం చిత్రం లో దేవ్ మోహన్, మోహన్ బాబు, అనన్య నాగళ్ల తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :