“పఠాన్” ఖచ్చితంగా ఇలాంటి సినిమానే..షారుఖ్ క్లారిటీ.!

“పఠాన్” ఖచ్చితంగా ఇలాంటి సినిమానే..షారుఖ్ క్లారిటీ.!

Published on Dec 18, 2022 10:00 AM IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం “పఠాన్” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ లో గత కొన్నాళ్ల నుంచి నెలకొన్న బాక్సాఫీస్ సంక్షోభాన్ని తీర్చే చిత్రంగా ఇది నిలుస్తుంది అని చాలా మంది ఆశిస్తున్నారు. మరి దీనిపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా విషయంలో నిన్ననే షారుఖ్ తన సోషల్ మీడియాలో ఓ అస్క్ సెషన్ ని చెయ్యగా అందులో అయితే షారుఖ్ ఈ చిత్రంపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని ఇచ్చాడు.

ఈ చిత్రం ఖచ్చితంగా ఓ దేశ భక్తి తరహా సినిమానే అని కాకపోతే భారీ యాక్షన్ తో కూడుకొని ఉంటుంది అని తాను క్లారిటీ ఇచ్చారు. దీనితో ఈ చిత్రంపై కొందరిలో కాస్త పాజిటివిటి నెలకొనేలా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ భారీ చిత్రాన్ని అయితే బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించగా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం జనవరి 25న రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు