బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ జవాన్. ఈ మూవీలో నయనతార, దీపికా పదుకొనె హీరోయిన్స్ గా నటించగా కోలీవుడ్ యువ డైరెక్టర్ అట్లీ దీనిని తెరకెక్కించారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గౌరి ఖాన్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇక జవాన్ ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ తో పాటు అద్భుతమైన కలెక్షన్ తో ప్రస్తుతం థియేటర్స్ లో కొనసాగుతోంది.
ఈ మూవీలో షారుక్ డ్యూయల్ రోల్ చేయగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించారు. విషయం ఏమిటంటే, జవాన్ మూవీ తాజాగా ప్రపంచవ్యాప్తంగా రూ. 660. 03 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సొంతం చేసుకుందని మేకర్స్ కొద్దిసేపటి క్రితం తమ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ద్వారా తెలిపారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జవాన్ అన్ని వర్గాల ఆడియన్స్ తో ఇంకా బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతూ తన సత్తా చాటుతోంది. మరి ఫైనల్ గా ఈ మూవీ ఎంత మేర కలెక్షన్ అందుకుంటుందో చూడాలి.