ప్రస్తుతం ఆడియెన్స్ అంతా ఎంతో ఎగ్జైటెడ్ గా ఎదురు చూస్తున్న పలు క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం జైలర్ 2 కూడా ఒకటి. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో గత పార్ట్ 1 లానే ఊహించని కామియో పాత్రలు కూడా ఉంటాయని తెలిసిందే. అయితే ఈ కామియో లలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కామియో కూడా ఒకటి.
ఇన్ని రోజులు తన ప్రెజెన్స్ ఉంటుంది, షూటింగ్ కూడా జరుగుతుంది అని టాక్ ఉంది కాని ఇప్పుడు దీనిపై మరింత క్లారిటీ వినిపిస్తోంది. దీని ప్రకారం షారుఖ్ ఖాన్ ఒక పోలీస్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది అలాగే ఒకింత ఎక్కువ నిడివి లోనే నటుడు ఎస్ జే సూర్య కాంబినేషన్ సీన్స్ కూడా ఉంటాయని టాక్. సో మొత్తానికి షారుఖ్ ఖాన్ కూడా ఇందులో మంచి ట్రీట్ ఇవ్వనున్నారని చెప్పవచ్చు.
