నాకు బాగా కనెక్ట్ అయ్యింది – షారుఖ్

Published on Sep 10, 2023 7:40 pm IST

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జవాన్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. నిజానికి పఠాన్‌ సినిమాతోనే ‘షారుఖ్ ఖాన్’ బాక్సాఫీస్ కింగ్ ఖాన్ అనిపించుకున్నాడు. ఇక అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ తో మరోసారి తనకు తిరుగు లేదని నిరూపించుకున్నాడు. మొత్తానికి షారుఖ్ ప్రస్తుతం జవాన్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ..’నా ఫ్యాన్స్ చాలా భిన్నంగా ఉంటారు. వారితో నా ప్రేమను కచ్చితంగా అనుభూతి చెందాల్సిందే. నేను మాటల్లో వివరించలేను. అభిమానుల ప్రేమ నన్ను ఈ స్థాయిలో ఉంచింది’ అని షారుఖ్ చెప్పుకొచ్చాడు.

షారుఖ్ ఖాన్ ఇంకా మాట్లాడుతూ.. జవాన్ సినిమాలోని విక్రమ్ రాథోడ్ పాత్రను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ పాత్ర నాకు పర్సనల్ గా బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే ఆజాద్ పాత్ర కూడా చాలా గొప్పగా ఉంటుంది. దర్శకుడు అట్లీ చాలా టాలెంట్ ఉన్న దర్శకుడు అంటూ షారుఖ్ కామెంట్స్ చేశాడు. మొత్తానికి భారీ అంచనాలతో వచ్చిన జవాన్, ఆ అంచనాలకు తగ్గట్టుగానే సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు.

సంబంధిత సమాచారం :