బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘కింగ్’(King). ‘వార్’, ‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కానుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్ సోషల్ మీడియాలో భారీ అంచనాలను పెంచేసింది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను షారుఖ్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం డిసెంబర్ 24, 2026న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. తమ అభిమాన నటుడిని వెండితెరపై చూడాలని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల్లో ఈ అప్‌డేట్ కొత్త ఉత్సాహాన్ని నింపింది.
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ మరియు మార్ఫ్లిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సీ మరియు రాణి ముఖర్జీ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
