అక్కడ ‘కెజిఎఫ్ – 2’ ని బీట్ చేసిన షారుఖ్ ఖాన్ ‘జవాన్’

Published on Sep 19, 2023 11:00 pm IST

షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మెసేజ్ యాక్షన్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ జవాన్. ఈ మూవీలో దీపికా పదుకొనె, నయనతార హీరోయిన్స్ గా కనిపించగా విలన్ గా విజయ్ సేతుపతి నటించారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గౌరి ఖాన్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సొంతం చేసుకుంది.

ఇక ప్రస్తుతం రిలీజ్ అయిన అన్ని భాషల్ల అదరగొడుతూ దూసుకెళ్తున్న జవాన్ మూవీ మొత్తంగా గడిచిన 12 రోజుల్లో వరల్డ్ వైడ్ రూ. 883.68 కోట్ల రూపాయల గ్రాస్ ని సొంతం చేసుకుంది. అలానే హిందీ వర్షన్ లో ఇప్పటివరకు నాలుగవ స్థానంలో ఉన్న కెజిఎఫ్ 2 ని బీట్ చేసిన జవాన్ టోటల్ గా రూ. 444 కోట్ల నెట్ కలెక్షన్ సొంతం చేసుకుంది. అనంతరం హిందీ వర్షన్ లో మూడవ స్థానంలో బాహుబలి 2, రెండవ స్థానంలో గదర్ 2, ప్రథమ స్థానంలో పఠాన్ నిలిచాయి. మరి మొత్తంగా ఈ మూడు సినిమాల కలెక్షన్ ని జవాన్ ఎంతవరకు బీట్ చేస్తుందో చూడాలని పలువురు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :