అప్పటి నుంచే డ్రగ్స్‌ తీసుకుంటున్నా – ఆర్యన్‌ ఖాన్

Published on Oct 4, 2021 7:17 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్‌ ఖాన్ డ్రగ్స్ లో ముగినితేలుతూ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు ఈ సూపర్ స్టార్ కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. కొన్ని సంచలన నిజాలను బయట పెట్టాడు ఆర్యన్ ఖాన్. ‘గత నాలుగు సంవత్సరాలుగా డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు ఆర్యన్ చెప్పాడు. పైగా యూకేలో ఉన్నప్పటి నుంచే డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆర్యన్ వెల్లండించాడు.

బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకుగా ఆర్యన్‌ ఖాన్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ క్రియేట్ అయింది. ఇక ఆర్యన్ ఖాన్ లండన్‌ లో సెవెన్‌ వోక్స్‌ లో అలాగే యూనివర్శిటి ఆఫ్‌ సౌత్‌ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో విద్యను పూర్తి చేశాడు. త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు అని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇలా ముంబైలో సముద్రం మధ్యలో ఓ క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తీసుకుంటూ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులకు చిక్కడం విచిత్రమే.

సంబంధిత సమాచారం :