ఆ హాలీవుడ్ బిగ్గీతో షారుఖ్ “పఠాన్” ట్రీట్..!

ఆ హాలీవుడ్ బిగ్గీతో షారుఖ్ “పఠాన్” ట్రీట్..!

Published on Nov 8, 2022 9:03 AM IST


బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “పఠాన్” కోసం అందరికీ తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ అయితే లేటెస్ట్ గా బాలీవుడ్ లో మెయిన్ టాపిక్ గా నిలిచింది. ఎప్పుడు నుంచో బాలీవుడ్ ఎదురు చూస్తున్న బాక్సాఫీస్ బ్లాస్ట్ అయితే ఈ సినిమాతో ఉండొచ్చనే మాట ఇప్పుడు బాగా స్టార్ట్ అయ్యింది.

ఇక క్రేజీ టీజర్ పై అయితే లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు తెలుస్తుంది. ఈ చిత్రం టీజర్ ని మేకర్స్ లేటెస్ట్ గా ఎన్నో అంచనాలు సెట్ చేసుకొని వస్తున్న హాలీవుడ్ భారీ చిత్రం బ్లాక్ పాంథర్ సిరీస్ “వకండా ఫరెవర్” తో అటాచ్ చేసి రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు. దీనితో ఈ చిత్రానికి మరింత బూస్టప్ అని చెప్పాలి. ఇక ఈ అవైటెడ్ సినిమాలో జాన్ అబ్రహం కూడా నటిస్తుండగా మేకర్స్ ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు