ఆ క్రెడిట్ అంతా దర్శకుడిదే..”జెర్సీ” సినిమాపై షాహిద్ కపూర్.!

Published on Apr 22, 2022 11:00 am IST

బాలీవుడ్ ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా “జెర్సీ”. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మన తెలుగు చిత్రం “జెర్సీ” కి హిందీలో రీమేక్ అయ్యింది.

మరి ఈ సినిమాని తెరకెక్కించిన దర్శకుడే గౌతమ్ తిన్ననూరి హిందీలో కూడా తీశారు. అయితే ఈ సినిమా కోసం మన తెలుగు ఆడియెన్స్ కి గాని నాచురల్ స్టార్ నాని ఇచ్చిన లైఫ్ టైం పెర్ఫామెన్స్ గాని ఎవరూ మర్చిపోలేరు. అలాగే ఈ సినిమాలో ఎమోషన్స్ ని కూడా దర్శకుడు అదే రీతిలో చూపించాడు. మరి హిందీలో ఈరోజు ఈ చిత్రం రిలీజ్ కాగా నిన్న బాలీవుడ్ మీడియాలో ప్రీమియర్స్ వేశారు.

అయితే అక్కడ సినిమా చూసిన ఆడియెన్స్ మరియు ప్రముఖులు స్టాండింగ్ ఓవియేషన్ అందించారు. దీనితో అక్కడ కూడా హిట్ రిపోర్ట్స్ నమోదు అయ్యాయి. మరి ఈ క్రెడిట్ అంతా కూడా తమ క్యాప్టెన్ గౌతమ్ కే దక్కుతుంది అని షాహిద్ సినిమా టోటల్ క్రెడిట్ ని గౌతమ్ కి ఇచ్చాడు.

సంబంధిత సమాచారం :