ఓటీటీలోకి హిందీ “జెర్సీ” మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Published on May 17, 2022 9:22 pm IST


బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం “జెర్సీ”. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని అదే పేరుతో దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి హిందీలో తెరకెక్కించారు. ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌కి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌ నెట్ ఫ్లిక్స్‌లో ఈనెల 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఇకపోతే దిల్ రాజు, నాగ‌వంశీ, అమ‌న్ గిల్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సంబంధిత సమాచారం :