నాని కి షాహిద్ కపూర్ థాంక్స్!

Published on Apr 22, 2022 8:11 pm IST

షాహిద్ కపూర్ హీరోగా, మృణాల్ తాకుర్ హీరోయిన్ గా గౌతమ్ తిన్ననూరీ దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం జెర్సీ. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ల లో విడుదల అయ్యింది. అల్లు ఎంటర్ టైన్మెంట్స్, దిల్ రాజు ప్రొడక్షన్, సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ల పై ఈ చిత్రాన్ని దిల్ రాజు, సూర్య దేవర నాగ వంశీ, అమన్ గిల్ లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. ఈ చిత్రం విడుదల కావడం తో టాలీవుడ్ హీరో నేచురల్ స్టార్ నాని స్పందించారు.

ఈ చిత్రాన్ని చూసిన నాని, సంతోషం వ్యక్తం చేశారు. హీరో షాహిద్ కపూర్, మృణాల్ ఠాకూర్, పంకజ్ కపూర్ లు బాగా నటించారు అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పోస్ట్ పై షాహిద్ కపూర్ స్పందిస్తూ, థాంక్స్ తెలిపారు. ఒక అర్జున్ నుండి మరొక అర్జున్ కి అంటూ చెప్పుకొచ్చారు. మీకు చాలా పెద్ద హృదయం ఉంది, అదే జెర్సీ గురించి అంటూ చెప్పుకొచ్చారు. టాలీవుడ్ లో జెర్సీ చిత్రం లో నాని హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :