జక్కన్న రాజమౌళి ట్వీట్ కి షారుఖ్ ఖాన్ ప్రేమపూర్వక రిప్లై

Published on Sep 8, 2023 9:02 pm IST

షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ మూవీ నిన్న భారీ అంచనాలతో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చి బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ సొంతం చేసుకుంది. ఆ విధంగా ఫస్ట్ డే ఫస్ట్ షో నుండే సూపర్ రెస్పాన్స్ ని అలానే కలెక్షన్ ని అందుకుంటూ దూసుకెళ్తున్న జవాన్ అన్ని ప్రాంతాల ఆడియన్స్ యొక్క మెప్పుతో కొనసాగుతోంది. షారుఖ్ ఖాన్ అద్భుత నటనతో పాటు అనిరుద్ సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అట్లీ అత్యద్బుత టేకింగ్ కి అందరి నుండి మంచి ప్రసంశలు కురుస్తున్నాయి.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ చూసి టీమ్ ని అభినందించారు. అలానే టాలీవుడ్ దిగ్గజ దర్శకడు జక్కన్న రాజమౌళి కూడా జవాన్ మూవీ చూసి తన ట్విట్టర్ ద్వారా హీరో షారఖ్, దర్శకుడు అట్లీ పై పొగడ్తల జల్లు కురిపించారు. అయితే ఆయన ట్వీట్ కి కొద్దిసేపటి క్రితం షారుఖ్ ఖాన్ ప్రేమపూర్వక రిప్లై అందించారు. థాంక్యూ సో మచ్ రాజమౌళి గారు, మీ క్రియేటివ్ ఇన్ పుట్స్ ద్వారా మేము ఎంతో నేర్చుకుంటున్నాము. మా మూవీ కూడా చూసి మీకు నచ్చితే నేను మాస్ హీరోగా సరిపోతానో లేదో కాల్ చేసి చెప్పండి అంటూ సరదాగా పోస్ట్ చేసిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :