మహేష్ బాబు ట్వీట్ పై షారుఖ్ ఖాన్ స్వీట్ రిప్లై

Published on Sep 8, 2023 6:29 pm IST

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మాస్ ఎమోషనల్ మూవీ జవాన్. అనిరుద్ సంగీతం అందించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి విలన్ గా నటించగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈ మూవీని గౌరి ఖాన్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇక నిన్న ఎన్నో అంచనాలతో పలు భాషల ఆడియన్స్ ముందుకి వచ్చిన జవాన్ ఫస్ట్ డే ఫస్ట్ షో నుండి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది.

ఇక తాజాగా ఈ మూవీని ప్రత్యేకంగా ఫ్యామిలీతో కలిసి వీక్షించిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, జవాన్ టీమ్ పై అలానే ప్రత్యేకంగా దర్శకుడు అట్లీ, హీరో షారుఖ్ ఖాన్ పై తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రసంశలు కురిపించారు. కాగా కొద్దిసేపటి క్రితం మహేష్ బాబు ట్వీట్ కి షారుఖ్ ఖాన్ స్వీట్ గా రిప్లై ఇచ్చారు. మీకు సినిమా నచ్చినందుకు అందరూ ఎంతో థ్రిల్ అయ్యారు. మీకు మీ కుటుంబానికి నా ప్రేమపూర్వక అభినందనలు. మీ నుండి ఇటువంటి మంచి మాటలు వినడం ఆనందంగా ఉంది. మీ అందరికోసం ఇకపై మరింతగా కష్టపడతాను, లవ్ యు మై ఫ్రెండ్ అంటూ ఆయన ఇచ్చిన రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :