వైల్డ్ బీస్ట్ గా షారుఖ్.. అట్లీ భారీ సినిమా టైటిల్ అనౌన్స్.!

Published on Jun 3, 2022 3:02 pm IST


బాలీవుడ్ మరియు పాన్ ఇండియా ఆడియెన్స్ లో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ హీరోగా నటిస్తున్న క్రేజీ సినిమా ఒకటి ఉంది. కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ తో ఫస్ట్ టైం టై అప్ అయ్యి చేసిన ఈ భారీ సినిమా చాలా హైప్ తో ఉంది. షారుఖ్ ఖాన్ కెరీర్ లో డెఫినిట్ గా భారీ హిట్ అవుతుంది అనుకున్న ఈ సినిమా టైటిల్ ని “జవాన్” గా మేకర్స్ ఒక సాలిడ్ గ్లింప్స్ కట్ తో అనౌన్స్ చెయ్యడం ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో కిక్ ఇస్తుంది.

అట్లీ అయితే తన మార్క్ ప్రెజెంటేషన్ లో షారుఖ్ ని ఒక కొత్త రోల్ లో చూపిస్తూ ఒక కంప్లీట్ మాస్ ఎక్స్ ప్లోజన్ గా ప్రెజెంట్ చేసాడు. ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ కి రీచ్ అయ్యేలా ఈ వీడియో కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వీడియోలో అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ కూడా బిగ్గెస్ట్ హైలైట్ గా కనిపిస్తుంది. అట్లీ అయితే షారుఖ్ ని వైల్డ్ బీస్ట్ గా చూపించాడు.. ఓవరాల్ గా అయితే పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ ని నమోదు చేయడం గ్యారెంటీ అనిపిస్తుంది.

వీడియో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :