డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “సైతాన్”

అజయ్ దేవగన్, మాధవన్, జ్యోతిక, జంకి బొడివాల ప్రధాన పాత్రల్లో, డైరెక్టర్ వికాస్ బాల్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ నాచురల్ హార్రర్ మూవీ సైతాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టింది . ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ గా మరోసారి ఆడియెన్స్ ను అలరించడానికి రెడీ అయిపోయింది.

ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో మే 4, 2024 నుండి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనుంది. ఇదే విషయాన్ని ఓటిటి ప్లాట్ ఫామ్ అధికారికంగా వెల్లడించడం జరిగింది. థియేట్రికల్ రిలీజ్ అయిన 57 రోజుల తర్వాత ఈ చిత్రం ఓటిటి లోకి రానుంది. జియో స్టూడియోస్, దేవగన్ ఫిల్మ్స్, పనోరమా స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందించారు. డిజిటల్ ప్రీమియర్ గా ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version