‘షకీలా బయోపిక్’ లేటెస్ట్ అప్ డేట్ !

మలయాళంలో 80-90 దశకంలో ‘షకీలా’ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. అప్పట్లో పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఆమె చిత్రాలకు పోటీగా తమ చిత్రాలను విడుదల చేసేవారు కాదు. అలాంటి ‘షకీలా’ జీవిత కథ త్వరలో సినిమాగా రాబోతున్న విషయం తెలిసిందే. అసలు నెల్లూరు జిల్లాకు చెందిన షకీలా.. సినీరంగంలోకి ఎలా వచ్చారు ? శృంగార తారగా ఎలా మారారు ?. సినీరంగంలో ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు ఏమిటి ? ఎంతమంది ఆమెను మోసం చేశారు ? ఇలాంటి పలు ఆసక్తికరమైన విషయాలతో షకీలా బయోపిక్ తెరకెక్కుతుంది.

కాగా, షకీలా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచా చద్దా నటిస్తోంది. తాజాగా రిచా చద్దా తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. అయితే రిచా చద్దా ఈ సినిమాలో నటించబోయే ముందు, ష‌కీలాతో మాట్లాడి ఆమె వ్యక్తిగత జీవితం గురించి, ఆమె బాడీ లాంగ్వేజ్ గురించి, ఆమె హావభావాలు మరియు అభిప్రాయాలు ఇలా ప్రతి విషయంలో షకీలా గురించి పూర్తిగా తెలుసుకుని మరి నటించిందట.

ఈ చిత్రానికి మలయాళ దర్శకుడు ఇంద్రజిత్‌ లంకేష్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో షకీలా అతిథి పాత్రలో నటిస్తుండటం విశేషం. తన బయోపిక్ గురించి ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో షకీలా మాట్లాడుతూ.. తన జీవితంలోని అతి ముఖ్యమైన తప్పులు, ఒప్పులు ఇలా తన లైఫ్ లో జరిగిన ప్రతి అంశం ఈ బయోపిక్ లో ఉంటాయని తెలిపింది.
ఇక ఈ చిత్రం హిందీ, మలయాళంతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా విడుదల కానుంది. త్వరలోనే చిత్రబృందం ప్రమోషన్స్ ను మొదలు పెట్టనున్నారు.

Exit mobile version