“శాకుంతలం” నుంచి రాబోతున్న సమంత ఫస్ట్ లుక్..!

Published on Feb 20, 2022 1:25 am IST

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్‌ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం “శాకుంతలం”. మహాభారత గాథలోని ఆదిపర్వం నందు గల శకుంతల-దుష్యంత మహారాజు ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటిస్తున్నాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 21న ఉదయం 9:30 గంటలకు సమంత ఫస్ట్ లుక్‌ని విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. గుణ టీమ్ వర్క్స్ మరియు దిల్ రాజు ప్రొడక్షన్స్ పతకాలపై నీలిమ గుణ మరియు దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం :