అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్న ‘అర్జున్ రెడ్డి’ ప్రేయసి !

12th, September 2017 - 09:05:58 AM


తెలుగులోని యువ కథానాయకిలలో ఒకరైన లావణ్య త్రిపాఠి ఈ మధ్య పలు ప్రాజెక్టుల నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. వాటిలో ‘100 % లవ్’ తమిళ రీమేక్ ‘100% కాదల్’ కూడా ఉంది. జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మొదట లావణ్యను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో డైలమాలో పడిన మేకర్స్ బాగ్ ఆలోచించి షాలిని పాండేను ఫైనల్ చేసుకున్నారట.

ఈ చిత్రాన్ని సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన చంద్రమౌళి డైరెక్ట్ చేయనున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో హీరో ప్రేయసిగా షాలిని పాండే పెర్ఫార్మెన్స్ కు గాను ప్రేక్షకులు, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. నాగ్ అశ్విన్ ‘మహానటి’ లో సైతం సావిత్రి స్నేహితురాలు జమున పాత్రకు ఎంపికైంది షాలిని .