క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ దక్కించుకున్న ‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ !


‘అర్జున్ రెడ్డి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి షాలిని పాండే. ఈ చిత్రంలో ఆమె నటనకుగాను ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా బాగా ఇంప్రెస్ అయ్యారు. దీంతో తెలుగు, తమిళం నుండి ఆమెకు భారీగా ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. ఆ ఆఫర్లలో టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటైన ‘మహానటి’ కూడా ఉంది. నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఒక కీ రోల్ కోసం షాలిని పాండేను సంప్రదించారట.

వరుస ఆఫర్లల్లో ప్రాముఖ్యతతో పాటు నర్తనకు ఆస్కారమున్న పాత్రల్నిమాత్రమే ఎంచుకుంటున్న షాలిని పాండే కూడా ‘మహానటి’ ఆఫర్ కు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఇకపోతే కీర్తి సురేష్, సమంత, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ నటీ నటులు నటిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మిస్తోంది.