‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ కొత్త సినిమా లాంచింగ్ రేపే !

తెలుగు పరిశ్రమలో ఈ మధ్యే విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం సాధించిన విజయం అంతా ఇంతా కాదు. ఆ విజయంతో చిత్ర ప్రధాన టీమ్ హాట్ ఫేమస్ అయిపోయారు. వాళ్లను మంచి మంచి అవకాశాలు వెతుక్కుంటూ మరీ వస్తున్నాయి. అలా గోల్డెన్ ఛాన్సులను దక్కించుకుంటున్న వారిలో చిత్ర కథానాయిక షాలినీ పాండే కూడా ఉంది.

ఇప్పటికే నాగ్ అశ్విన్ ‘మహానటి’ ప్రాజెక్టులో నటిస్తున్న ఆమె ‘100 % లవ్’ తమిళ రీమేక్ ‘100 % కాదల్’ లో ప్రధాన హీరోయిన్ గా సెట్టైపోయి అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. ఈ చిత్రం రేపే లాంచనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా గనుక హిట్టైతే షాలిని పాండే తమిళంలో కూడా బిజీ అయిపోవడం ఖాయం. జీవీ ప్రకాష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎం.ఎం. చంద్రమౌళి డైరెక్ట్ చేయనున్నారు.